ఈ వీడియోను వింటే లతా మంగేష్కర్ పాడుతుందేమో అనిపిస్తుంది. కానీ పొరపాటు.. రైల్వే స్టేషన్‌లో ఒక సాధారణ మహిళ తన గాత్రంతో అందరినీ మంత్రముగ్ధులని చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని రానాఘాట్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ పాడిన పాట మిలియన్ల వ్యూస్‌ను సంపాదించింది. రెండు నిమిషాల నిడివితో ఉన్న ఈ పాట ఏక్ ప్యార్ క నగ్మా హై అంటూ సాగుతుంది. 1972లో లతా మంగేష్కర్ పాడిన ఈ పాట అందరినీ అలరించగా మరోసారి ఈమె గాత్రంతో ఆకట్టుకుంది. అయితే ఆమె టాలెంట్‌ను వీడియో తీసిన కృష్ణదాస్ అనే వ్యక్తి ఆదివారం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘ఎంత మనోహరమైన గొంతు..’ అంటూ ఆమెను నెటిజన్లు ఆకాశానికి ఎత్తారు. గతంలోనూ రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తి అద్భుతంగా పాడగా అది సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే..!