శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో భారత ఓపెనర్ మురళీ విజయ్-కెప్టెన్ విరాట్ కోహ్లిలు బ్యాటింగ్‌లో విశ్వరూపం ప్రదర్శించారు. తొలుత 163 బంతుల్లో శతకం సాధించిన విజయ్.. 251 బంతుల్లో 150 పరుగులు నమోదు చేశాడు. ఆపై కాసేపటికి కోహ్లి 150 పరుగుల మార్కును చేరుకున్నాడు. 178 బంతుల్లో 150 పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు.