భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సరికొత్త రికార్డు సాధించాడు. 20 వేల అంతర్జాతీయ పరుగుల మార్కును వేగవంతంగా సాధించిన రికార్డును కోహ్లి నమోదు చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు 37 పరుగుల దూరంలో ఉన్న కోహ్లి దాన్ని అందుకున్నాడు. దాంతో 417 ఇన్నింగ్స్‌ల్లో 20 వేల అంతర్జాతీయ పరుగులు(టెస్టులు, వన్డేలు, టీ20లు) సాధించి ‘ఫాస్టెస్ట్ రికార్డు’ నమోదు చేశాడు.