ఈడెన్‌ గార్డెన్స్‌లో నేడు వెస్టిండీస్‌తో తొలి టి20 | T 20 match west indies in Eden garden | Sakshi
Sakshi News home page

ఈడెన్‌ గార్డెన్స్‌లో నేడు వెస్టిండీస్‌తో తొలి టి20

Nov 4 2018 7:19 AM | Updated on Mar 21 2024 6:46 PM

 టెస్టు సిరీస్‌ను ఏకపక్షంగా గెల్చుకుని, వన్డే సిరీస్‌ను ఒడిసిపట్టిన టీమిండియా... టి20 సిరీస్‌లోనూ వెస్టిండీస్‌ సంగతి తేల్చేందుకు సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇక్కడి ఈడెన్‌ గార్డెన్స్‌లో రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది. మిగతా విషయాలు ఎలా ఉన్నా తమ ఆటతీరుకు సరితూగే పొట్టి ఫార్మాట్‌లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పర్యాటక జట్టు అత్యంత కఠినమైనది. పైగా ఈసారి దాదాపు చాలామంది కొత్తవారితో ఆడనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement