పసిడి పతకం నెగ్గిన భారత షూటర్‌ | Shreyasi Singh, the double trap gold medallist at Gold Coast | Sakshi
Sakshi News home page

పసిడి పతకం నెగ్గిన భారత షూటర్‌

Apr 12 2018 7:34 AM | Updated on Mar 21 2024 6:42 PM

మరోసారి భారత షూటర్లు కచ్చితమైన గురితో అదరగొట్టారు. కామన్వెల్త్‌ గేమ్స్‌ షూటింగ్‌ ఈవెంట్‌లో మరో మూడు పతకాలు అందించారు. మహిళల డబుల్‌ ట్రాప్‌లో శ్రేయసి సింగ్‌ ‘షూట్‌ ఆఫ్‌’లో స్వర్ణం ఖాయం చేసుకోగా... పురుషుల 50 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఓంప్రకాశ్‌ మితర్వాల్‌... డబుల్‌ ట్రాప్‌ విభాగంలో అంకుర్‌ మిట్టల్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. దాంతో ఏడో రోజు పోటీలు ముగిశాక భారత్‌ 12 స్వర్ణాలు, 4 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 24 పతకాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది.  

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement