ఇట్స్‌ ఏ విరుష్కా పార్టీ..! | Shah Rukh Khan Cant Stop Dancing with Virushka | Sakshi
Sakshi News home page

ఇట్స్‌ ఏ విరుష్కా పార్టీ..!

Dec 27 2017 10:43 AM | Updated on Mar 20 2024 12:04 PM

ఇట్స్‌ ఏ విరుష్కా పార్టీ.. అంటూ ముంబైలో అట్టహాసంగా సాగిన భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ స్టార్‌ అనుష్క శర్మల రెండో రిసెప్షన్‌లో బాలీవుడ్‌ తారాలు, టీమిండియా క్రికెటర్లు విరుష్కతో చిందేశారు. లోయర్‌ పారెల్‌లోని సెయింట్‌ రెజిస్‌ లగ్జరీ హోటల్‌లో ఘనంగా జరిగిన ఈ వివాహ విందులో బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ విరుష్కతో చేసిన డ్యాన్స్‌ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. షారుక్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ సాంగ్‌ ‘చెయ్య చెయ్య చెయ్యా’. పాటకు ఈ ముగ్గురు స్టార్స్‌ చిందేశారు. ఈ డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. శ్రీలంకతో సిరీస్‌ ముగియడంతో టీమిండియా ఆటగాళ్లంతా ఈ వేడుకకు విచ్చేశారు. సీనియర్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ ప్రత్యేక గౌన్‌లో తళుక్కున మెరిసింది. మాజీ కెప్టెన్‌ ధోని తన భార్య సాక్షి సింగ్, గారాల పట్టి జీవాతో కలిసి వేడుకలో పాల్గొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement