ఆసియా కప్ టోర్నీలో పాల్గొనేందుకు రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు గురువారం సాయంత్రం యూఏఈకి బయల్దేరింది. దీనికి సంబంధించిన ఫోటోలు టీమిండియా మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్, చహల్‌లు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియాపై భారీ అంచనాలే ఉన్నాయి. విరాట్ కోహ్లికి విశ్రాంతి నేపథ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన రోహిత్ సేన ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాలి. టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో విఫలమైన ధోని ఆసియాకప్‌లోనైనా తిరిగి ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.