పదేళ్ల తర్వాత న్యూజిలాండ్ గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక ఐదో వన్డేలో 35 పరుగుల తేడాతో రోహిత్ సేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవం సందర్భంగా టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను చూసి సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని దూరంగా పారిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ప్రపంచంలోని ఏ బౌలర్ కూడా ధోనిని భయపెట్టలేదు.. కానీ చహల్ భయపెట్టాడు అంటూ నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.