షోయబ్‌ జీజూ(బావ)..ఒకసారి ఇటు చూడవా | Moment when Shoaib Malik waved at Indian fans calling him 'jeeju | Sakshi
Sakshi News home page

షోయబ్‌ జీజూ(బావ)..ఒకసారి ఇటు చూడవా

Sep 24 2018 4:50 PM | Updated on Mar 20 2024 3:38 PM

ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. సూపర్‌-4 స్టేజ్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది. అయితే మ్యాచ్‌ జరిగే సమయంలో పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌‌ మాలిక్‌ ఫీల్డింగ్‌ చేస్తుండగా  ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.  భారత క్రికెట్‌ అభిమానులు ‘షోయబ్‌ జీజూ(బావ).. ఒకసారి ఇటు చూడవా’ అంటూ కేకలు వేశారు. షోయబ్‌‌ ప్రముఖ భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement