ఎప్పుడూ ఫీల్డ్‌లో కూల్‌గా ఉండే మన ఎంఎస్ ధోనికి కోపమొచ్చింది. ఎంతలా అంటే సహచర ఆటగాడు మనీష్ పాండేపై గట్టిగా అరచి మందలించేంతగా. ' ఓయ్ ఇటు చూడు.. అటెటో కాదు' అంటూ మనీష్‌పై ధోని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత తొలుత బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇది చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో భాగంగా 19వ ఓవర్‌లో మనీష్‌పై తీవ్రంగా మండిపడ్డాడు. ఆ సమయానికి ధోని స్ట్రైకింగ్‌లో ఉండగా, పాండే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో నిలుచున్నాడు.