టైటిల్‌పై సింధు, శ్రీకాంత్‌ ఆశలు | Dubai World Superseries Finals 2017 | Sakshi
Sakshi News home page

టైటిల్‌పై సింధు, శ్రీకాంత్‌ ఆశలు

Dec 13 2017 7:08 AM | Updated on Mar 22 2024 11:27 AM

బ్యాడ్మింటన్‌ ప్రపంచంలో ప్రతిష్టాత్మక టోర్నీ అయిన బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ పోటీలకు రంగం సిద్ధమైంది. ఇక్కడి హమ్‌దాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో నేటి నుంచి ఐదు రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం టాప్‌–8 స్థానాల్లో ఉన్న ఆటగాళ్లు మాత్రమే ఇందులో పాల్గొంటున్నారు. ఫలితంగా ప్రతీ మ్యాచ్‌ హోరాహోరీగా, రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఆటగాళ్లను రెండు గ్రూప్‌లలో విభజించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement