ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళల కోసం విప్లవాత్మకమైన పథకాలకు శ్రీకారం చుట్టారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నవరత్నాల్లో ముఖ్యమైనది అమ్మ ఒడి పథకం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు, బిడ్డల చదువుల కోసం రెక్కలు ముక్కలు చేసుకునే మహిళల కష్టాలు తీర్చేలా అమ్మ ఒడి పథకం ఉంటుందన్నారు. అమ్మ ఒడి పథకం కూడా ఆరోగ్యశ్రీ, ఫీజురియంబర్స్ లాగా దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుందన్నారు.