వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వరప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. అన్నింటికి కేవలం పునాది మాత్రమే వేసి బాబు ప్రజలను నమ్మిస్తారని అన్నారు. రాజధానిలో అన్నీ తాత్కాలిక భవనాలే అని మండిపడ్డారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్‌సీపీ గురువారం చేపట్టిన ‘వంచనపై గర్జన దీక్ష’ లో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, భారతీయ జనతాపార్టీలు ఆంధ్రప్రదేశ్‌ని ఏవిధంగా మోసం చేశారో ప్రజలకు తెలియజెప్పడానికే ‘వంచనపై గర్జన దీక్ష’ చేపట్టామని అన్నారు. విభజన హామీలను తీసుకురాలేని అసమర్థుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు.