అవినీతి, అబద్ధాలు, మోసాలు.. వీటితో పాటు రోజుకో డ్రామాకు తెరతీస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలన కొనసాగిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రే దళారిగా మారి అక్రమాలు చేస్తున్నారన్న వైఎస్ జగన్.. సినిమాలో చంద్రబాబు నటించి ఉంటే మాత్రం ప్రతి సంవత్సరం కచ్చితంగా ఉత్తమ విలన్ అనే అవార్డు ఆయన సొంతం చేసుకునేవారని ఎద్దేవా చేశారు.