స్థానిక ఎమ్మెల్యేనే ప్రజల నుంచి టీడీపీ ట్యాక్స్ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. 212వ రోజు ప్రజా సంకల్స యాత్రలో భాగంగా శనివారం జగన్ తూర్పు గోదావరి జిల్లా గొల్లల మామిడాడలో ప్రసంగించారు. ప్రజల నుంచి అక్రమంగా ట్యాక్స్ వసూలు చేసి స్థానిక ఎమ్మెల్యే నుంచి మంత్రి లోకేష్ వరకూ లంచాలు వెళ్తున్నాయని జగన్ ఆరోపించారు. ప్రతి ఎమ్మెల్యే రెండు లక్షలు వసూలు చేసి కలెక్టర్ ద్వారా లోకేష్‌కు పంపుతున్నారని పేర్కొన్నారు.