చంద్రబాబు పాలనకు నాలుగేళ్లు పూర్తయ్యింది. ఇప్పటిదాకా ఇచ్చిన హామీలు పూర్తి కాలేదు.. మరి ప్రజలు సంతోషంగా ఉన్నారా? అని అడుగుతున్నా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 22వ రోజు ఆలూరు నియోజకవర్గం బిల్లేకల్ వద్ద అశేష జనవాహిని సమక్షంలో వైఎస్ జగన్ ప్రసంగించారు. వైఎస్ జగన్ ప్రసంగిస్తూ... మాట్లాడితే 12 శాతం అభివృద్ధి పెరిగిందని చంద్రబాబు అంటున్నారు. మరి మీ జీవితాల్లో అది కనిపిస్తుందా? అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించగా.. లేదు అన్న సమాధానం వినిపించింది. నాలుగేళ్ల నుంచి చంద్రబాబు ఇదే డ్రామా ఆడుతున్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవటంతో అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొందని జగన్ అన్నారు. ప్రతీ కులాన్ని, మతాన్ని చంద్రబాబు దారుణంగా మోసం చేశారన్నారు. ఇలాంటి వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో ఎన్నుకుందామా? అని ఆయన ప్రశ్నించారు.
గతాన్ని ఓసారి గుర్తు చేసుకో...
Nov 30 2017 7:31 PM | Updated on Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement