రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపు డిమాండ్‌తో లోక్‌సభలో ఆందోళన చేస్తున్న టీఆర్‌ఎస్ తన వ్యూహాన్ని మార్చుకుంది. లోక్‌సభ కార్యకలాపాలను అడ్డుకోవడం కాకుండా.. అవిశ్వాసంపై జరిగే చర్చలో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని లేవనెత్తి కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సోమవారం ప్రగతిభవన్‌లో సమావేశమైంది.