దిశ చట్టం పగడ్బందీ అమలుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు 13 కోర్టులకు అవసరమైన బడ్జెట్‌ను కూడా వెంటనే కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు విశాఖ ఉత్స వ్ పై కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో విజయసాయిరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28న విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా, రాజధాని పేరుతో అమరావతి రైతులను మోసం చేసింది చంద్రబాబు నాయుడేనని రాప్తాడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. ఇక, హైదరాబాద్ పోలీస్‌కు బెస్ట్ క్వాలిటీలో దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.