జిల్లాలోని దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో పర్యాటక పడవ బోల్తా పడింది. ఈ పడవలో సిబ్బందితో కలిసి 61 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. 27 మందిని స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప‍్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన సీఎం జగన్... యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు ముఖ్య నాయకులు పార్టీలో చేరారు.
ఈనాటి ముఖ్యాంశాలు
Sep 15 2019 8:13 PM | Updated on Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement