కల్వర్టును ఢీకొట్టి, ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాలనుంచి చెన్నూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు జైపూర్ వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది.