దొంగతనానికి వచ్చే వాడు ఎవరూ గుర్తు పట్టకుడా ఉండేలా ముఖానికి మాస్క్ వేసుకుని.. బెదిరించడానికి ఆయుధాలు తీసుకోని వస్తాడు. చూడ్డానికి గుండేలు తీసిన బంటులా ఉంటాడు. కానీ, ఇప్పుడు మేము చెప్పబోయే దొంగ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు. ఈ దొంగ చేసిన పనిని చూస్తే భయపడడం కంటే ముందు పడి పడి నవ్వుతారు. ఎందుకంటే దోపిడీకి వచ్చిన ఈ దొంగ ఏమాత్రం జాగ్రత్త లేకుండా బెదిరించడానికి తెచ్చుకున్న గన్‌నే పారేసుకుని.. చివరికి అవతలి వారికి చిక్కకుండా కాలికి బుద్ధి చెప్పి పరారయ్యాడు. కొలరెడోలో చోటుచేసుకున్న ఈ వెరైటీ దొంగతనం వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.