మొదట్నుంచీ ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ పోరాడుతూనే ఉందని, టీడీపీ అప్పుడే కళ్లు తెరిచి ఉంటే ఏపీకి ప్రయోజనం కలిగేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలో ఎంత విలువ ఉందో మొన్నటి అవిశ్వాస తీర్మానం సమయంలో దేశం మొత్తానికి తెలిసిందని ఎద్దేవా చేశారు. హోదా అనేది టీడీపీ వ్యక్తిగత విషయం కాదని, రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన అంశమన్నారు.