రౌడీ షీటర్‌‌తో కలిసి మంత్రి పరిటాల సునీత చెక్కుల పంపిణీ | Paritala Sunitha In Another Controversy In Anantapur | Sakshi
Sakshi News home page

రౌడీ షీటర్‌‌తో కలిసి మంత్రి పరిటాల సునీత చెక్కుల పంపిణీ

Feb 5 2019 4:39 PM | Updated on Mar 22 2024 11:10 AM

ఫ్యాక్షనిజం, రౌడీయిజానికి కేరాఫ్‌ అడ్రస్‌ టీడీపీ అన్న విషయం తెలిసిందే. తెర వెనుక రౌడీయిజాన్ని పెంచి పోషిస్తూ బయటకి మాత్రం అమాయక ముసుగు వేసుకోవడంలో టీడీపీ నాయకులు సిద్దహస్తులు. తాజాగా మరోసారి రౌడీ షీటర్లకు, టీడీపీ నాయకుల మధ్య ఉన్న సత్సంబంధాలు బయటపడ్డాయి.  ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడే ప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా రావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ సంఘటన అనంతపురంలోని చిన్మయ్‌ నగర్‌లో చోటుచేసుకుంది. పసుపు కుంకుమ కార్యక్రమంలో భాగంగా మంత్రి పరిటాల సునీత రౌడీ షీటర్‌ ఉప్పర శీనాతో కలిసి డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేసి వివాదంలో చిక్కుకున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement