ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూజివీడుకి చేరుకున్నారు. గాంధీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో జనసంద్రమైంది. సభలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకు కృషి చేస్తామన్నారు.