సాక్షి, హైదరాబాద్ : ప్రగతి భవన్ వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ప్రగతి భవన్ వద్ద మెరుపు ధర్నాకు దిగారు. పీపీఈ కిట్లు ధరించి పెద్ద ఎత్తున చేరుకున్న ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల కళ్లు గప్పి కార్యకర్తలు క్యాంప్ కార్యాలయానికి తరలివచ్చారు. దీంతో బేగంపేట- పంజాగుట్ట రహదారిలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.