ఏపీ సీఎం చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తనకు ఓట్లేసిన అన్ని వర్గాల ప్రజలను సీఎం అయ్యాక చంద్రబాబు నిర్ధాక్షిణ్యంగా మోసం చేశారని విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం, నల్లమడలో వైఎస్ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన బహిరంగసభలో ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ‘శాసనసభలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల నోరు నొక్కడానికి చంద్రబాబు సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రజల మద్ధతుతో మేం ముందుకు సాగుతున్నాం. అందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు భారీ సంఖ్యలో తరలివస్తున్న ప్రజానీకమే అందుకు నిలువెత్తు నిదర్శనం. తమ సమస్యలను జననేత వైఎస్ జగన్‌కు చెప్పుకొనేందుకు ప్రతిచోటా ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.