‘ఇసుక ధరల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు’ | Minister Peddireddy Ramachandra Reddy Checks Sand Reach In Vijayawada | Sakshi
Sakshi News home page

‘ఇసుక ధరల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు’

Nov 25 2019 7:30 PM | Updated on Nov 25 2019 7:33 PM

గ్రామీణ అభివృద్ది, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  రొయ్యూరు ఇసుక రీచ్‌ను సోమవారం తనిఖీ చేశారు. ఈ క్రమంలో మంత్రి రీచ్‌ ఇసుక తవ్వకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రోజుకు ఎంత ఇసుకను వెలికితీస్తున్నారు, ఏ మేరకు వినియోగదారులకు ఇసుకను అందిస్తున్నారు అని మైనింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిమాండ్‌ను బట్టి రీచ్‌లో అదనంగా మిషన్లను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసిన వారికి రవాణా చేస్తున్న లారీ యాజమానులతో మంత్రి ముచ్చటించారు. కాగా ఇసుక తరలింపులో ఎటువంటి జాప్యం లేకుండా జాగ్రత్త తీసుకోవాలంటూ అధికారులను హెచ్చరించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement