సాక్షి,అమరావతి: మత్స్యకారుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదారత చూపారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. పాకిస్తాన్ చెర నుంచి విడుదలయిన 20 మంది ఆంధ్రా జాలర్లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 14 నెలలుగా పాకిస్తాన్ చెరలో మగ్గి.. మానసికంగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన మత్స్యకారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ మానవతా దృక్పథంతో స్పందించి ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. సాయంత్రం మత్స్యకారులకు సీఎం జగన్ ఐదు లక్షల రూపాయల చొప్పున చెక్‌లు అందజేస్తారని మంత్రి మోపిదేవి వెల్లడించారు.