‘బేటీ బచావో, బేటీ పడావో’ అంటూ గొప్ప, గొప్ప మాటలు చెప్పిన ప్రధాని మోదీ దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా ఇంత భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. బాధితులకు న్యాయం చేయాలంటూ ఆయన గురువారం అర్ధరాత్రి దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.