లోక్‌సభ సభ్యుల ప్రవర్తన స్కూల్ పిల్లల కన్నా దారుణంగా ఉందని స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. రఫేల్ విమానాల కొనుగోలు వివాదంపై అధికార, ప్రతిపక్షాలు సభలో సృష్టిస్తున్న గందరగోళం నేపథ్యంలో స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మన కన్నా స్కూల్ పిల్లలు నయం అని నాకు ఓ మెసేజ్ వచ్చింది. స్కూల్ పిల్లల కన్నా మనం దారుణమా?’అని ఆమె వ్యాఖ్యానించారు. లోక్‌సభ ప్రారంభమైన కొద్దిసేపటికే రఫేల్ వివాదంపై ఇరు పక్షాలు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పోటాపోటీగా నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడంతో ప్రారంభమైన కొద్ది సేపటికే ఇరు సభలు మరుసటి రోజుకు వాయిదా పడ్డాయి.