రాష్ట్ర ప్రజలు ఇసుకపై టీడీపీ టాక్స్ కడుతున్నారని.. ఆ టాక్స్‌మీద వచ్చే డబ్బును చంద్రబాబు నాయుడు, లోకేష్ పంచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందు నుంచే వేల లారీల ఇసుక అక్రమంగా తరలిపోతుందని ఆరోపించారు.