భార్యను ఎలా కొట్టాలంటే..!

ప్రస్తుతం ఇంటర్నేట్‌లో వైరలవుతోన్న ఓ వీడియో చూస్తే మళ్లీ ఓ వందేళ్లు వెనక్కి ప్రయాణించాం అనిపించకమానదు. అంతేకాక ముస్లిం దేశాల్లో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో.. నేటికీ మహిళకు వారిచ్చే విలువ ఏంటో ఈ వీడియో చూస్తు పూర్తిగా అర్థమవుతుంది. ఖతర్‌కు చెందిన సోషియాలజిస్ట్‌ ఒకరు ఓ అద్భుతమైన వీడియోను పోస్ట్‌ చేశారు. దానిలో సదరు వ్యక్తి మగవాడు భార్యను ఎలా కొట్టాలి.. అందుకు ముస్లిం మతంలో ఉన్న నియమాలేంటో చక్కగా వివరించి పురుషోద్ధారకుడు అయ్యాడు.

ఇక ఆ వీడియోలోని విషయాలు.. ‘పెళ్లైన మగవారు ఈ వీడియోను తప్పక చూడాలి. భార్యను కొట్టడం తప్పనిసరి.. కానీ ప్రతిరోజు కాదు. ఈ కొట్టడం కూడా ఎలా ఉండాలంటే భార్యకు తాను ఆడదాన్ని అని.. భర్త మగవాడు, బలవంతుడు అనే విషయాన్ని గుర్తుకు తెచ్చేలా కొట్టాలి. భార్యకు తన భర్త శక్తిసామర్థ్యాలు తెలిసేలా దండించాలి. ముందు మీరొక విషయం అర్థం చేసుకోవాలి. కుటుంబాన్ని ఓ కంపెనీగా భావిస్తే.. భర్త దాని యజమాని. భార్య అందులో వర్కర్‌. వర్కర్‌ బుద్ధిగా మసులు కోవడం కోసం యజమాని వారిని దండించాలి. అలా అయితేనే వారి జీవితం సాఫీగా సాగుతుంది. ప్రేమగా ఉంటడం వల్ల క్రమశిక్షణ అలవడద’ని పేర్కొన్నాడు.

‘భార్య పద్దతిగా నడుచుకోవాలంటే భర్త తన ప్రేమను పక్కకు పెట్టి భార్యను కొట్టాలి. భార్య క్రమశిక్షణతో మసలకపోతే.. ముందు హెచ్చరించాలి.. తరువాత సలహా ఇవ్వాలి.. అప్పటికి దారికి రాకపోతే పడక గదికి దూరంగా ఉంచాలి. ఆఖరి ప్రయత్నంగా మాత్రమే ఆమెను దండించాలి. మన ముస్లిం మతం ఎంత జాలీ గలదో చూడండి. భార్యను కొట్టే విషయంలో పాటించాల్సిన నియమాలను కూడా చక్కగా వివరించింది. లాగిపెట్టి ముఖం మీద కొట్టడం, ముక్కు మీద గుద్దడం.. తల మీద బాదడం లాంటివి చేయకూడదు. రక్తం వచ్చేలా కూడా కొట్టకూడదు’ అంటూ గొప్పగా వివరించడమే కాక ఓ డెమో కూడా చేసి చూపించాడు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top