ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అవుతోంది. పైన కురుస్తున్న వర్షలతో యమున నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత మూడేళ్లుగా ఎన్నడూ లేని రీతిలో ఢిల్లీలో నీటి మట్టం 205 మీటర్లకి చేరింది. హర్యానాలోని హిరాకుడ్ డ్యాం నుంచి శనివారం ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో నది ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం సహయక చర్యలను ముమ్మరం చేసింది.