టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన సుమారు 40మంది టీడీపీ నేతలు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.