గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని మీడియాకు తప్పుడు ప్రచారం ఇచ్చిన డాక్టర్ వసంత్‌ను సోమవారం అధికారులు సస్పెండ్ చేశారు. దీంతో మంగళవారం ఆయన ఆసుపత్రి ఎదుట పెట్రోల్ డబ్బాతో వీరంగం సృష్టించాడు. వివరాలు.. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ వసంత్ సీఎంవోగా పనిచేస్తున్నారు. ఈక్రమంలో గాంధీలో ఇద్దరూ కరోనా వైరస్ బారీనా పడినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగంతో ఆయనను సస్పెండ్ చేశారు. దీంతో తాను చేయనని తప్పుకు బలయ్యానని.. తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. వ్యక్తిగత కక్షతోనే తనపై తప్పుడు ఆరోపణలు సృష్టించారని పేర్కొన్నారు. వేంటనే తనకు న్యాయం చేయాలని లేదంటే ఆసుపత్రి ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.