ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 334వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం పలాస నియోజకవర్గం, వజ్రపుకోతూరు మండలంలోని రాజాంకాలనీ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ధర్మపురం, గరుఢభద్ర, తర్లగాదురు క్రాస్,అక్కనపల్లి, గాదురు, చీపురుపల్లి జంక్షన్ మీదుగా డెప్పురు వరకు పాదయాత్ర కొనసాగిస్తారు.