ప్రత్యేక హోదా కోసం బంద్ చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ కార్యదర్శి పి.మధు తెలిపారు. మరో నేత బాబూరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చూడటం దారుణంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఒక వైపు హోదా కోసం తామే పోరాడుతున్నామని చంద్రబాబు చెబుతూ మరో వైపు పోలీసులతో అరెస్టులు చేయించడం చంద్రబాబుకు తగదని అన్నారు.
అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలి
Jul 24 2018 11:24 AM | Updated on Mar 22 2024 11:13 AM
Advertisement