రెండు కాళ్లు, చేతులు లేకపోయినా జిమ్నాస్టిక్స్‌ | Child Practicing Gymnastics Without Having Hands And Legs | Sakshi
Sakshi News home page

రెండు కాళ్లు, చేతులు లేకపోయినా జిమ్నాస్టిక్స్‌

Jun 6 2019 5:28 PM | Updated on Mar 22 2024 10:40 AM

రెండు కాళ్లు, చేతులు లేకపోయినా జిమ్నాస్టిక్స్‌ చేస్తూ ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చున్నది అక్షర సత్యంమని చిన్నారి నిరూపించింది. అసలు బ్రతకటమే కష్టం అనుకున్న ఆ పాప చెంగుచెంగున గెంతుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని బాత్‌కు చెందిన హార్మోనీ రోజ్‌ అల్లెన్‌ అనే చిన్నారి 11నెలల వయసులో ఓ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా రెండు కాళ్లు, చేతులు కోల్పోయింది. దీంతో అల్లెన్‌ బ్రతకటం కష్టమని డాక్టర్‌ తేల్చిచెప్పేశారు. కానీ డాక్టర్ల అంచనాలను తారుమారు చేస్తూ అల్లెన్‌ ప్రాణాలను నిలుపుకుంది. కానీ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా కాళ్లు, చేతులతోపాటు చిన్నారి ముక్కు కూడా సగం దెబ్బతింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement