ఎర్రచందనం వేలం వెనుక కుట్ర ఉందని సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎర్రచందనం ఆదాయం ద్వారా రుణమాఫీ చేస్తామని చెప్పి ..అడవుల్లో ఉన్న పచ్చదనన్నాంత మాఫీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు ఎర్రచందనం అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో ఒక్కరూపాయి కూడా రుణమాఫీ చేయలేదన్నారు. 35 లక్షల ఎకరాల్లో విస్తారంగా ఉన్న ఎర్రచందనాన్ని పచ్చదండు తన్నుకుపోతోందని ధ్వజమెత్తారు.