ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలిపిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రకటలు చేసినా, మంత్రులు కార్మికులకు నచ్చజెప్పినా 300 మంది కూడా ఉద్యోగంలో చేరలేదని వెల్లడించారు. జాయిన్ అయినవాళ్లకు కూడా డ్యూటీలు వేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కార్మికులెవరూ భయపడొద్దు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే గుర్తింపు సంఘం ఆమోదం తీసుకోవాలనే చట్టముంది. చర్చల ప్రక్రియమొదలుపెట్టండని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం’అన్నారు.
కేసీఆర్ ఇష్టారాజ్యం కాదు..
Nov 6 2019 12:52 PM | Updated on Nov 6 2019 1:52 PM
Advertisement
Advertisement
Advertisement
