మెరుగైన వైద్య సేవల కోసమే.. | AP CM YS Jagan launches Aarogyasri in three cities | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్య సేవల కోసమే..

Nov 2 2019 7:54 AM | Updated on Mar 22 2024 11:30 AM

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ తీసుకున్న కీలక నిర్ణయం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో 130 ఆసుపత్రుల్లో ఈ సేవలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. దీంతో ఈ మూడు నగరాల్లోని 130 ఆసుపత్రుల్లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు 17 సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లోని 716 రకాల జబ్బులకు వైద్య సేవలు అందుబాటుల్లోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement