గణతంత్ర వేడుకల్లో భాగంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక సీఎం జాతీయ పండుగలో పాల్గొనకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మంత్రులతోపాటు సీఎం సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌లు వేడుకలో భాగం పంచుకున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆలస్యంగా.. ఏపీలో ప్రధాన జెండా పండుగ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.