పార్టీ నేతలతో మోదీ అత్యవసర భేటీ | Amit Shah Skips Kerala In Abrupt Sked Change, Meets PM Modi, Arun Jaitley In Delhi | Sakshi
Sakshi News home page

పార్టీ నేతలతో మోదీ అత్యవసర భేటీ

Oct 5 2017 4:42 PM | Updated on Mar 20 2024 1:57 PM

ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అగ్రనేతలతో అత్యవసర భేటీ నిర్వహించారు. కేరళలో గురువారం జనరక్ష యాత్రలో పాల్గొనాల్సిన పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా తన కార్యక్రమాన్ని రద్దు చేసకుని మరీ ఈ కీలక సమావేశానికి హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో అధికారిక కార్యక్రమంలో పాల్గొని తిరిగివచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా ప్రధానితో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపైనా ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం.

ఆర్థిక రంగం కుదేలైందన్న విపక్షాల విమర్శలను ప్రధాని తోసిపుచ్చిన క్రమంలో ఆర్థిక మంత్రి జైట్లీ, పార్టీ చీఫ్‌ అమిత్‌ షాలతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ ప్రయోజనాలను పరిరక్షించే క్రమంలో కఠిన నిర్ణయాలకూ వెనుకాడమని కూడా ప్రధాని పేర్కొన్న విషయం విదితమే.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement