బీజేపీ ఎమ్మెల్యేను చితకబాదిన తల్లి, భార్య | Ahead of PM Modi’s trip, mob thrashes BJP MLA Raju Todsam, ‘second wife’ in Yavatmal | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్యేను చితకబాదిన తల్లి, భార్య

Feb 13 2019 4:25 PM | Updated on Mar 21 2024 10:58 AM

బీజేపీ ఎమ్మెల్యే రాజు నారాయణ తోడ్సమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రెండో భార్యతో కలిసి ఉంటూ తనను నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా రాజు నారాయణ మొదటి భార్యతో తల్లి కూడా రోడ్డుపైనే ఆయనను చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలేం జరిగిందంటే..
మహారాష్ట్రలోని ఆర్ని(ఎస్టీ)నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజు నారాయణ తన రెండో భార్య ప్రియాతో కలిసి మంగళవారం 42వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నారు. అనంతరం ఓ క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటికి తిరిగి వెళ్లేందుకు పయనమయ్యారు. ఈ క్రమంలో నారాయణ తల్లి, ఆయన మొదటి భార్య అర్చన అక్కడికి చేరుకున్నారు. వారిని వాహనాన్ని అడ్డగించి ప్రియాను కిందకి లాగి ఆమెపై దాడి చేశారు. చెంప దెబ్బలు కొడుతూ, తన్నుతూ ఆమెపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో ప్రియాను కాపాడేందుకు వాళ్లకు అడ్డుపడిన రాజు నారాయణను కూడా చితకబాదారు. వీరికి అక్కడ ఉన్న స్థానికులు కూడా మద్దతుగా నిలిచారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement