అతనో చిరుద్యోగి.. రూ. కోట్ల ఆస్తికి ఆయన యజమాని.. అత్యంత విలాసవంతమైన జీవితం.. ఖరీదైన కార్లు... కళ్లు చెదిరిపోయే ఇల్లు.. సినిమా హాల్‌ను తలపించే భారీ తెర.. ఒక్కోటి రూ. లక్షలు విలువ చేసే చేతి గడియారాలు.. ఇలా అతని ఆర్థిక వ్యవహారాలను చూస్తే దిమ్మ తిరిగిపోవడం ఖాయం.. జిల్లా కేంద్రం ఏలూరులోని పంచాయతీరాజ్ శాఖ ఆర్‌డబ్ల్యూఎస్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రాంపల్లి సత్యఫణి దత్తాత్రేయ దివాకర్‌కు చెందిన అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు.