చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై మహిళల ఆగ్రహం | Womens fires On Chandrababu, Pawan Kalyan | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై మహిళల ఆగ్రహం

Jul 23 2025 10:19 PM | Updated on Jul 23 2025 10:19 PM

పూసపాటిరేగ : ఉపాధి హామీ పనులకు సంబంధించి కొద్ది నెలలుగా ఎందుకు వేతనాలు వేయడం లేదని, అధికారంలోకి వచ్చి ఇంత అన్యాయం చేస్తారా? అని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొల్లాయివలస గ్రామంలో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. 

ఇందులో గ్రామానికి చెందిన ఆవాలు రాములమ్మతో పాటు పలువురు మహిళలు చంద్రబాబు సర్కారు మోసాలపై తిట్ల దండకం చదివారు. నిరుపేదలైన తాము ఉపాధి పనులకు వెళ్తే.. నేటికీ డబ్బులు వేయలేదని, మా ఉసురు తగులుతోందని శాపనార్ధాలు పెట్టారు. తమను మోసం చేశారని మండిపడ్డారు. తాగడానికి నీటి చుక్క లేక ఇబ్బంది పడుతున్నామని దుయ్యబట్టారు. సమీపంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మహిళలను వారించినా వినకుండా దుమ్మెత్తిపోశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement