వివాదాలకు కేరాఫ్‌గా ‘అన్న కాంటిన్లు’ | Anna Canteens Became Hub of Controversies | Sakshi
Sakshi News home page

వివాదాలకు కేరాఫ్‌గా ‘అన్న కాంటిన్లు’

Oct 7 2026 10:49 PM | Updated on Oct 7 2026 10:49 PM

టీడీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ‘అన్న కాంటిన్లు’ వివాదాలకు కేరాఫ్‌గా మారాయి. నాణ్యతలేని, దుర్వాసన వస్తున్న ఆహారంతో పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బుధవారం ఆళ్లగడ్డ ఆన్న కాంటీన్‌లో పెడుతున్న ఆహారం కుక్కలు కూడా తినేలా లేదంటూ తమ ఆవేదనను వెళ్లగక్కిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

అన్న కాంటీన్‌లో వడ్డిస్తున్న అద్వాన్నపు భోజనాన్ని, అక్కడి దుస్థితిని కొందరు భోజనం చేస్తున్న పేదలను పలకరించగా ఈ మధ్య భోజనం అత్యంత దరిద్రంగా ఉంటోందని, ఈ రోజు అయితే రెండు మూడు రోజుల క్రితం చేసిన పప్పు, కూరలుగా ఉన్నాయని ప్లేట్‌లో కలుపుకుంటుంటే దుర్వాసన వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడం సంచలనంగా మారింది. నెటిజన్లు, నిరుపేదలు ఈ వీడియోపై స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement