ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం పట్టుకుని ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకు అర్దం కావడం లేదని బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. చంద్రబాబు మానసికవ్యాధితో బాధ పడుతున్నారని, ఇటువంటి వ్యక్తి సీఎంగా మనకు అవసరమా అని నిప్పులు చెరిగారు. హైకోర్టు ఏపీకి ఇస్తే, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి లబ్ధి చేకూర్చడానికే అని బాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.