అనిల్‌ కపూర్‌ నివాసానికి ప్రముఖులు | Sridevi death Celebrities throng Anil Kapoor’s house | Sakshi
Sakshi News home page

Feb 27 2018 7:35 AM | Updated on Mar 22 2024 10:48 AM

శ్రీదేవి మృతి నేపథ్యంలో అనేకమంది బాలీవుడ్‌ ప్రముఖులు ముంబైలోని ఆమె మరిది అనిల్‌ కపూర్‌ ఇంటికి తరలి వస్తున్నారు. శ్రీదేవి ఇద్దరు కూతుళ్లు జాహ్నవి, ఖుషీ ఆదివారం నుంచి ఈయన ఇంట్లోనే ఉన్నారు. నటీనటులు మాధురీ దీక్షిత్, జయప్రద, టబు, అమీషా పటేల్, సౌత్‌ సూపర్‌స్టార్‌ రజినీకాంత్, కమల్‌ హాసన్, ఆయన భార్య సారిక, కూతుళ్లు శృతి, అక్షర హాసన్‌లు, దివ్యా దత్తా, సారా అలీ ఖాన్, జెనీలియా, రితేశ్‌ దేశ్‌ముఖ్, దర్శకులు భారతీ రాజా, ఫరా ఖాన్, కరణ్‌ జోహార్, ఫర్హాన్‌ అక్తర్, రితేశ్‌ సిధ్వానీ, శేఖర్‌ కపూర్, తెలుగు సినీ హీరో వెంకటేశ్‌ తదితర ప్రముఖులు సోమవారం ఉదయం అనిల్‌ ఇంటికి వెళ్లారు. అటు లోఖండ్‌వాలా ప్రాంతంలోని శ్రీదేవి ఇంటికి కూడా ఆమె అభిమానులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement