అమెరికా అధ్యక్షుడి అర్థిక సలహాదారు రాజీనామా చేయటంతో వాణిజ్య యుద్ధాల భయం మళ్లీ చెలరేగింది. ఫలితం... ప్రపంచ మార్కెట్లు భారీగానే పతనమయ్యాయి. దీనికి బ్యాంక్ షేర్ల నష్టాలు కొనసాగడం కూడా జత కావడంతో మన స్టాక్ మార్కెట్ బుధవారం నష్టపోయింది. స్టాక్ సూచీలు వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ క్షీణించాయి.